Showing posts with label Job Alerts. Show all posts
Showing posts with label Job Alerts. Show all posts

Sunday, August 13, 2023

ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 6329 పోస్టులు

 




*ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 6329 పోస్టులు*

*🌺దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (ఈఎంఆర్‌ఎస్‌)లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ ఎగ్జామ్‌ (ఈఎస్‌ఎస్‌ఈ-2023 నోటిఫికేషన్‌ను నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ విడుదల చేసింది.*

*👉 మొత్తం ఖాళీలు: 6329*
*పోస్టుల వారీగా ఖాళీలు*
టీజీటీ-5660

🌺 *టీజీటీలో సబ్జెక్టుల వారీగా ఖాళీలు*

👉 హిందీ- 606
👉 ఇంగ్లిష్‌-671
👉 మ్యాథ్స్‌-686
👉 సోషల్‌ స్టడీస్‌-670
👉 సైన్స్‌-678
👉 టీజీటీ థర్డ్‌ లాంగ్వేజ్‌-652 👉 (తెలుగు- 102)

*💥టీజీటీ మిస్‌లీనియస్‌ కేటగిరీ*

👉 మ్యూజిక్‌ – 320
👉 ఆర్ట్‌ – 342
👉 పీఈటీ (మేల్‌)- 321
👉 పీఈటీ (ఫిమేల్‌)- 345
👉 లైబ్రేరియన్‌ – 369
👉 మొత్తం ఖాళీలు: 1697

*💥నాన్‌ టీచింగ్‌ పోస్టులు*

👉 హాస్టల్‌ వార్డెన్‌ (మేల్‌)- 335
👉 హాస్టల్‌ వార్డెన్‌ (ఫిమేల్‌)-334
👉 మొత్తం ఖాళీలు: 669

👉అర్హతలు: *ఆర్‌ఐఈలో నాలుగేండ్లు ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. బీఈడీ ఉత్తీర్ణత. దీనితోపాటు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.*

*👉 హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత. మిగిలిన పోస్టుల అర్హతల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.*

💥ఎంపిక:

*👉 ఎగ్జామ్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌) – 120 మార్కులకు*

*👉 లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ – 30 మార్కులకు*

*👉 ఈ పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, నాలెడ్జ్‌ ఆఫ్‌ ఐసీటీ, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, డొమైన్‌ నాలెడ్జ్‌, లాంగ్వేజ్‌ కాంపిటెన్సీపై ప్రశ్నలు ఇస్తారు.*

*💥హాస్టల్‌ వార్డెన్‌*

*👉 జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, నాలెడ్జ్‌ ఆఫ్‌ ఐసీటీ, నాలెడ్జ్‌ ఆఫ్‌ పోక్సో, అడ్మినిస్ట్రేటివ్‌ ఆప్టిట్యూడ్‌, లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ జనరల్‌ హిందీ, జనరల్‌ ఇంగ్లిష్‌, రీజనల్‌ లాంగ్వేజ్‌పై పరీక్ష నిర్వహిస్తారు.*

నోట్‌: *పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.*

*💥ముఖ్యతేదీలు*

👉 దరఖాస్తు: *ఆన్‌లైన్‌లో*

👉 చివరితేదీ: - ఆగస్టు 18

👉 ఫీజు: - టీజీటీ పోస్టుకు రూ.1500/-,

👉 హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుకు  రూ.1000/-

👉 వెబ్‌సైట్‌:   www.emrs.tribal.gov.in

Wednesday, August 2, 2023

ESIC జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలివే

 

ఈఎస్‌ఐసీ ఈ నోటిఫికేషన్ ద్వారా హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్-2 (Seniar Scale & Junior Scale) పోస్టులను భర్తీ చేయనుంది.
ప్రధానాంశాలు:
  • ఈఎస్‌ఐసీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌
  • పలు విభాగాల్లో 47 పోస్టుల భర్తీ
  • నవంబర్‌ 1 దరఖాస్తులకు చివరితేది
ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) తాజాగా 47 స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్-2 (Seniar Scale & Junior Scale) పోస్టులను భర్తీ చేయనుంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://www.esic.nic.in/recruitments లో ఉన్న దరఖాస్తు ఫామ్‌లను పొందవచ్చు. అభ్యర్థులు స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నవంబర్ 1 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, లడఖ్, లాహౌల్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లోని చంబా జిల్లాలో నివసిస్తున్న అభ్యర్థులకు నవంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సెలక్షన్ బోర్డు నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ఉంటుంది.

ఏపీలో భారీ జాబ్ మేళా.. హాజరుకానున్న 18 ప్రముఖ కంపెనీలు.. భారీ సంఖ్యలో ఉద్యోగాలు
ముఖ్య సమాచారం:
ఈఎస్‌ఐసీ నిబంధనల ప్రకారం ఆసక్తి గల అభ్యర్థులు స్థానిక భాషలో మాట్లాడగలగాలి. సీనియర్ స్కేల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు నవంబర్ 1 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.78,800 ప్రారంభ వేతనం ఉంటుంది. గుర్తింపు పొందిన మెడికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. జాబ్ నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత స్పెషాలిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.

జూనియర్ స్కేల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నవంబర్ 1 నాటికి 40 ఏళ్లు మించకూడదు. వీరికి ప్రారంభ వేతనం రూ.69,700 ఉంటుంది. వీరు తప్పనిసరిగా లాంగ్వేజ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో లోకల్ లాంగ్వేజ్ తెలిసిన ఉద్యోగాలు పొందొచ్చు. అదనపు సమాచారం కోసం లింక్‌ పై క్లిక్‌ చేయవచ్చు.

 

 

 

Thursday, July 27, 2023

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త! 1520 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ MHSRB Telangana 1

 


 మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త!  1520 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ MHSRB Telangana 1520 General 

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త!

  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1520 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలను వెంటనే తనిఖీ చేసే దరఖాస్తులు చేయండి.
తెలంగాణ ప్రభుత్వం, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తాజాగా మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) విభాగాల్లో ఖాళీగా ఉన్న 1520 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ నేడే జారీ చేసింది. మొత్తం 100 మార్పుల ప్రాతిపాదికన నియామకాలు చేపడుతున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఇందులో భాగంగా రాత పరీక్షకు 80 మార్కులు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ/ ప్రైవేటు ఇనిస్టిట్యూట్ లో అవుట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి 20 పాయింట్లు కేటాయించింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఆన్లైన్ దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఇక్కడ.


ఖాళీల వివరాలు:

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 1520.


పోస్ట్ పేరు :: మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్(మహిళలు).


రాష్ట్రవ్యాప్తంగా జోన్ల వారీగా ఖాళీల వివరాలు:

  1. జూన్-1 (కాలేశ్వరం) - 169,
  2. జూన్-2 (బాసర) - 225,
  3. జూన్-3 (రాజన్న) - 263,
  4. జోన్-4 (భద్రాద్రి) - 237,
  5. జూన్-5 (యాదాద్రి) - 241,
  6. జూన్-6 (చార్మినార్) - 189,
  7. జూన్-7 (జోగులాంబ) - 196. మొదలగునవి.
  8. ఇలా మొత్తం 1520 శాశ్వత ఖాళీలు ఉన్నాయి.


విద్యార్హత:

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి, తప్పనిసరిగా మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి.
  • తెలంగాణ రాష్ట్ర నర్స్ మరియు మెడ్వైవెస్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.

లేదా

  • తప్పనిసరిగా ఇంటర్మీడియట్ అర్హతతో వోకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) టైం కోర్సు పూర్తి చేసి, ఒక సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రి నందు క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
  • ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సంబంధిత ఆసుపత్రి నందు పూర్తి చేసి ఉండాలి.
  • అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.


వయో పరిమితి:

  • 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకూడదు.
  1. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
  2. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం:

  1. రాత పరీక్ష ,అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన ప్రకారం ఉంటుంది.
  2. మొత్తం 100 మార్కులు ప్రతిపాదికన ఎంపికలను నిర్వహిస్తారు.
  3. రాత పరీక్ష 80 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఓఎంఆర్ (లేదా) కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
  4. 20 మార్కులు రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్/ ఇన్స్టిట్యూట్ లలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి 6 నెలలకు 2.5 మార్కుల చొప్పున పాయింట్లను కేటాయిస్తారు.
  5. ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


రాత పరీక్ష సెంటర్ల వివరాలు:

  • హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్..


గౌరవ వేతనం: 
  • ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.31,040 - 92,050/- ప్రకారం చెల్లిస్తారు.


దరఖాస్తు ఫీజు:

  1. ఆన్లైన్ రాత పరీక్ష ఫీజు రూ.500/-,
  2. ప్రాసెసింగ్ ఫీజు రూ.200/- చెల్లించాలి.


దరఖాస్తు విధానం:

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.08.2023 ఉదయం 10:00 గంటల నుండి,


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.09.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.


అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



డిగ్రీ తో 1875+ ఉద్యోగాలు | వెంటనే దరఖాస్తు చేయండి. SSC CAPFs Permanent Positions Recruitment 2023

 



బ్యాచిలర్ డిగ్రీ తో ఎలాంటి అనుభవం లేకుండా శాశ్వత ఉద్యోగాలు.

  1. భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
  2. మహిళా, పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
  3. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. అధికారిక ఆన్లైన్ దరఖాస్తు లింక్ పేజీ చివరలో పిన్ చేయబడింది చూడండి.
భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు వివిధ విద్యార్హతలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే యున్నది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీసు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల నియామకానికి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 22.07.2023 నుండి 15.08.2023 వరకు సమర్పించవచ్చు. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను అక్టోబర్ 2023 లో నిర్వహిస్తున్నట్లు ముందుగానే అధికారికి నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.


ఖాళీల వివరాలు:

  • మొత్తం పోస్టుల సంఖ్య : 1876.


పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

  • మొత్తం 2 విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ జి డి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. అవి;
  1. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (BSF, CISF, CRPF, ITBP, SSB) విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ (GD) - 1714.
  2. ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) మహిళ/ పురుషులు - 162..


అర్హత ప్రమాణాలు..


విద్యార్హత:

  • 15.08.2023 నాటికి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ అర్హతను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కలిగి ఉండాలి.
  1. బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత పరీక్షలను రాసీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేయవచ్చు.
  2. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
  3. ఈ ఉద్యోగాలకు మహిళలు & పురుష అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. రిజర్వేషన్ల వారీగా వారికి ఖాళీల కేటాయింపులు నిర్ణయించబడ్డాయి.
  • పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


వయోపరిమితి: 

  • 01.08.2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
  • అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థుల(స్థితిని బట్టి) 5 - 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం:

  • కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
  1. ఈ రాత పరీక్ష పేపర్ - ఇంగ్లీష్ & హిందీ మాధ్యమాల ఉంటుంది.
  2. Tier -1, Tier -2 రూపంలో పరీక్ష నిర్వహిస్తారు.
  3. ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్కు కేటాయించారు.
  4. నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
  5. 📌 ప్రతి తప్పు సమాధానానికి  ముప్పావు (0.25) మార్కు కోత విధిస్తారు.
  • Tier -1, Tier -2 పరీక్షల్లో భాగంగా NCC సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు బోనస్ మార్కులను కేటాయించారు.
  1. NCC-C సర్టిఫికెట్ కలిగిన వారికి 10 మార్కులు,
  2. NCC-B సర్టిఫికెట్ కలిగిన వారికి 06 మార్కులు,
  3. NCC-A సర్టిఫికెట్ కలిగిన వారికి 04 మార్పులు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, పే స్కేల్ లెవెల్-6 ప్రకారం రూ.35,400 - రూ.1,12,400/- ప్రతి నెల అలవెన్స్లతో కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు.


పరీక్ష సెంటర్ల వివరాలు:

  • దేశవ్యాప్తంగా మొత్తం 9 రీజియన్ లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్య జిల్లాలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలు; 

📌 AP లో - చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్టణం మొదలగునవి.

📌 TS లో - హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మొదలగునవి.


దరఖాస్తు విధానం:

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు: రూ.100/-.

  • ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు మరియు మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.07.2023 నుండి,


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.08.2023 రాత్రి 11:00 గంటల వరకూ.


ఆన్లైన్ దరఖాస్తులో సవరణలకు కరెక్షన్ విండో అందుబాటులోకి వచ్చే తేదీ :: 16.08.2023 నుండి 17.08.2023 రాత్రి 11:00 గంటల వరకు.


కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించు తేదీ :: అక్టోబర్, 2023.


అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

 

 

TREIRB Gurukulam Hall Ticket 2023

TREIRB Gurukulam Hall Ticket 2023 OUT: Download TGT, PGT Admit Card @treirb.telangana.gov.in


 

Time Table Download

TREIRB Gurukulam Hall Ticket 2023: 

The Telangana Residential Educational Institutions Recruitment Board (TREIRB) issued the admit card for 9210 teacher posts such as  TGT, PGT, Art Teacher & Drawing Teacher, Music Teacher, Lecturer, Physical Director & Other, Junior Lecturer, Physical Director & Librarian, Physical Director (School), Craft Teacher & Instructor. The exam will be conducted from 01 August 2023 to 23 August 2023. Candidates can download TS Teacher 2023 hall ticket from the official website: streirb.aptonline.in.

The mode of the exam will be online. Candidates are advised to appear in the exam based on the allotted examination schedule.  The exam will have 100 questions each on General Studies, General Abilities and Basic Proficiency in English, Pedagogy of the concerned subject.
Career Counseling


TREIRB Gurukulam Hall Ticket 2023

The board has released the admit card on its official website. Candidates who have applied for the recruitment exam can download admit card by login into the website.  The direct TS KGBV Hall Ticket download link to download TS KGBV admit card is given below.

TREIRB Gurukulam  Admit Card 2023 Download Here

How to Download TREIRB Gurukulam  Hall Ticket 2023?

The stepwise procedure to download TS Teacheer admit card 2023  is mentioned below. 

Step 1: Visit the official website  - treirb.

Step 2: Go to the ‘Click here to download hall-ticket for Art, Craft & Music examinations.’

Step 3: Now, login to download the hall-ticket for Art, Craft & Music exams using your User ID & Password..

Tuesday, June 20, 2023

గ్రామీణ బ్యాంకుల్లో 9,000+ పోస్టులు.. దరఖాస్తు

 


 

 గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా మూడు రోజులే గడువు ఉంది. పూర్తి వివరాలివే..

దేశవ్యాప్తంగా రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (RRB)ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే నియామక పరీక్షకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (IBPS) భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులకు గడువు సమీపిస్తోంది. జూన్‌ 21వరకు మాత్రమే గడువు ఉండటంతో ఈలోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (CRP)ల ద్వారా దేశవ్యాప్తంగా 9,053 ఉద్యోగాల భర్తీకి జూన్‌ 1 నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌ స్కేల్‌ II, III స్థాయి పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులను అర్హులుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21వరకు https://www.ibps.in/    వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

 మొత్తం ఉద్యోగాలివే..

ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) 5,650 ఉండగా.. ఆఫీసర్‌ స్కేల్‌ I(ఏఎం) పోస్టులు  2563, ఆఫీసర్‌ స్కేల్‌ II జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌ 367, ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) 106, ఆఫీసర్‌ 2 (సీఏ) 63, ఆఫీసర్‌ స్కేల్‌ 2 (లా ఆఫీసర్‌) 56, ట్రజరీ ఆఫీసర్‌ స్కేల్‌- 2 పోస్టులు 16, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ 38, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ స్కేల్‌ -2 పోస్టులు 118, ఆఫీసర్‌ స్కేల్‌ -3 పోస్టులు 76 చొప్పున ఉన్నాయి.

 

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ షెడ్యూల్‌..

  • దరఖాస్తుల స్వీకరణ: జూన్‌ 1 నుంచి జూన్‌ 21 వరకు
  • ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌(PET): జులై 17 నుంచి 22వరకు
  • ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(PET) కాల్‌ లెటర్ల డౌన్‌లోడ్‌:  జులై 10
  • ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్ష: ఆగస్టులో జరిగే అవకాశం
  • ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు, మెయిన్స్‌ పరీక్ష సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
  • మెయిన్స్‌ ఫలితాలు అక్టోబర్‌లో ప్రకటించి.. అక్టోబర్‌/నవంబర్‌ మాసాల్లో ఇంటర్వూలు నిర్వహిస్తారు. 
  • ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌:  జనవరి, 2024
  • దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ ₹175; ఇతరులు ₹850
  • ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్కు, పీవో (అసిస్టెంట్‌ మేనేజర్‌) విద్యార్హత గ్రాడ్యుయేషన్‌ ఉంటే చాలు. ఎలాంటి అనుభవం అవసరంలేదు.
  • ఆఫీసర్‌ స్కేల్‌- 2 జనరల్‌ బ్యాంకింగ్ ఆఫీసర్‌ (మేనేజర్‌) పోస్టులకు గ్రాడ్యుయేషన్‌లో 50శాతం మార్కులు ఉండాలి. ఏదైనా బ్యాంకు/ఫైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో  రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరి. 
  • వేతనం: ఉద్యోగాల హోదాలను బట్టి నెలకు కనీస వేతనం రూ.15వేలు నుంచి గరిష్ఠంగా రూ.44వేలు వరకు ఉండొచ్చు.
పరీక్ష విధానం, వయో పరిమితి, దరఖాస్తు చేసుకొనే విధానం, ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, పరీక్ష కేంద్రాలు, తదితర పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

  పూర్తి నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి     

కస్తూర్బాగాంధీ స్కూల్స్‌లో 1241 పోస్టులు: 17న నోటిఫికేషన్ విడుదల

 


కస్తూర్బాగాంధీ స్కూల్స్‌లో 1241 పోస్టులు: 17న నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్ఎస్)లలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్ఎస్‌లలో మొత్తం 1241 ఉద్యోగాలు కాట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. 854 పీజీ సీఆర్టీ, 273 సీఆర్టీ, 77 పీఈటీ, 12 ఎస్ఓ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. జూన్ 26 నుంచి జులై 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరిస్తారు
https://schooledu.telangana.gov.in/ISMS/లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. Download PDF

కాంట్రాక్టు ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు

 

Sunday, June 18, 2023

SBI RBO Recruitment: 194 పోస్టుల కోసం అప్లై చేయండి

 


 SBI RBO Recruitment: 194 పోస్టుల కోసం అప్లై చేయండి

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు SBI అధికారిక సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 194 పోస్టులను భర్తీ చేస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమైది. జూలై 6, 2023న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కోసం దిగువన చదవండి.
 

 ముఖ్యమైన తేదీలు:
 
దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 15, 2023
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 6, 2023

ఖాళీ వివరాలు:

FLC కౌన్సెలర్లు: 182 పోస్టులు
FLC డైరెక్టర్లు: 12 పోస్టులు

ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ రౌండ్ ఉంటాయి. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది. తుది ఎంపిక కోసం మెరిట్ జాబితా కేవలం ఇంటర్వ్యూలో పొందిన స్కోర్‌ల అవరోహణ క్రమంలో తయారు చేయబడుతుంది. అభ్యర్థి స్కోరింగ్ కనీస అర్హత మార్కులకు లోబడి ఉంటుంది. ఇంటర్వ్యూ కోసం సమాచారం/కాల్ లెటర్ ఇమెయిల్ ద్వారా పంపబడుతుంది లేదా బ్యాంక్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాల

 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


 

Saturday, December 3, 2022

తెలంగాణలో మరో 16,940 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

 రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇందులో భాగంగానే.. నాలుగు రోజుల క్రితమే 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

 


 

ప్రధానాంశాలు:
  • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు 2022
  • కీలక ప్రకటన చేసిన సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌
  • మరో 16, 940 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌
Telangana Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభావార్త చెప్పింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇందులో భాగంగానే.. నాలుగు రోజుల క్రితమే 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇప్పుడు మరో 16, 940 ఉద్యోగాలకు మూడు రోజుల్లో అనుమతి ఇవ్వనున్నట్టు సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, భర్తీలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఇప్పటి వరకు 60 వేల 929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని సోమేశ్ కుమార్ వెల్లడించారు. కాగా.. మరో 16 వేల 940 పోస్టులకు మూడు రోజుల్లో అనుమతులు వస్తాయన్నారు. అయితే.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసే దిశలో ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా.. ప్రబుత్వం 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా.. అందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు కూడా నిర్వహించింది. డిసెంబర్ 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించనుంది. ఇక.. డిసెంబర్‌లో మరో మూడు కీలక ప్రకటనలు చేయనుంది. ఇందులో గ్రూప్‌-2, 3, 4 నోటిఫికేషన్లు వచ్చే నెలలో జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. గ్రూప్‌-2, 3, 4కి సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి ఇవ్వడంతో భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్‌సీ వేగవంతం చేసింది.

TSPSC Jobs : డిసెంబర్‌లో 3 కీలక జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల చేయనున్న TSPSC .. పూర్తి వివరాలివే
TSPSC Ready to release Group 2 3 4 Notifications : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకల ప్రక్రియ వేగం పుంజుకుంది. 80,039 పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తోంది. తాజాగా పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకు సంబంధించిన PET/PMT తేదీలను TSLPRB ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీస్‌, వైద్యారోగ్యశాఖతోపాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ తదితర పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చేశాయి. ఇందులో పోలీస్‌, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. పోలీస్‌కి సంబంధించి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు డిసెంబర్‌ 8 నుంచి దేహ దారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. ఇక.. గ్రూప్‌-1 మెయిన్స్‌ను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తామని TSPSC గతంలోనే ప్రకటించింది.


డిసెంబర్‌లో మూడు కీలక నోటిఫికేషన్లు:
ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా టీఎస్‌పీఎస్‌సీ వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్‌లో మరో మూడు కీలక ప్రకటనలు చేయనుంది. ఇందులో గ్రూప్‌-2, 3, 4 నోటిఫికేషన్లు మూడు వచ్చేనెలలో జారీ చేసేందుకు TSPSC కసరత్తు చేస్తోంది. గ్రూప్‌-2, 3, 4కి సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి ఇవ్వడంతో భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్‌సీ వేగవంతం చేసింది. గ్రూప్‌-2లో భాగంగా 726 ఉద్యోగాలు, గ్రూప్‌-3లో 1,373 ఉద్యోగాలు, గ్రూప్‌-4లో 9,168 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అయితే.. గ్రూప్‌-2, 3, 4లో కొత్తగా కొన్ని పోస్టులను చేరుస్తూ.. ఈ నెల 24వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


Tags:  ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్,

TSPSC Ground Water Department Posts :టీఎస్‌పీఎస్సీ (TSPSC) నుంచి మరో రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

 


 

TSPSC Ground Water Department Posts :టీఎస్‌పీఎస్సీ (TSPSC) నుంచి మరో రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ కు సంబంధించినవి. వీటిలో నాన్ గెజిటెడ్ పోస్టులు (Non Gazetted)- 25, గెజిటెడ్ (Gazetted) పోస్టులు- 32 ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి రెండు నోటిఫికేషన్లను విడివిడిగా TSPSC విడుదల చేసింది.

నాన్ గెజిటెడ్ పోస్టుల వివరాలు:

  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) - 07
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ) - 05
  • టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) - 08
  • ల్యాబ్ అసిస్టెంట్ - 01
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 04

విద్యార్హతలు:
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) .. జియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ).. సివిల్ ఇంజనీరింగ్ లో జియాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. లేదా హైడ్రాలజీలో రెండేళ్ల ఎమ్సెస్సీ పూర్తి చేసి ఉండాలి.
  • టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్).. జియో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎంటెక్ లో జియో ఫిజిక్స్ పూర్తి చేసిన వారు అర్హులు.
  • ల్యాబ్ అసిస్టెంట్.. కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్.. జియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా మ్యాథమేటిక్స్ లేదా జియాలజీ ఒక సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • నాన్ గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తుల ప్రారంభ తేదీ - డిసెంబర్ 07, 2022
  • దరఖాస్తులకు చివరి తేదీ - డిసెంబర్ 28, 2022

గెజిటెడ్ ఉద్యోగాలు
  • అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 01
  • అసిస్టెంట్ కెమిస్ట్ - 04
  • అసిస్టెంట్ జియోఫిజిస్ట్ - 06
  • అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ - 16
  • అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 05

అర్హతలు
  • అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్.. మెటీరియాలజీ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమేటిక్స్ లేదా అప్లైడ్ మేథమేటిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • అసిస్టెంట్ కెమిస్ట్.. కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీలో డిగ్రీ కలిగి ఉండాలి. లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు. వీటితో పాటు.. పీజీ కూడా ఉండాలి.
  • అసిస్టెంట్ జియోఫిజిస్ట్.. జియో ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్.. జియాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్.. సివిల్ ఇంజనీరింగ్ లో జియోలజీ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. లేదా హైడ్రాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • గెజిటెట్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 06, 2022 నుంచి ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 27, 2022 వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగనుంది.

 

 పూర్తి వివరాలకు ఇక్కడ      క్లిక్‌ చేయండి.

Tuesday, July 26, 2022

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ ....

 

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..

 


 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అందులో భాగంగానే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా MBBS ఉద్యోగార్థులకు, ఆరోగ్యశాఖ శుభవార్త చెప్పింది. మొత్తం 969 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు, ఈ నెల 21వ తేదీ నుండి ఆగస్ట్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. దరఖాస్తు చేయడానికి ముందు ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఈ పేజి చివర లో కనిపిస్తున్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారికి నోటిఫికేషన్స్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయిన ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..

ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య : 969


విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 751,

◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్/ జనరల్ డ్యూటీ - 211,

◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ మెడిసిన్ - 7..


విద్యార్హత: 

ప్రస్తుత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి MBBS లేదా దానికి సమానమైన విద్యార్హతతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.


వయోపరిమితి:

దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి, అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు.. పూర్తి వివరాలుకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

 

దరఖాస్తు విధానం:

దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు మరియు ప్రాసెసింగ్ ఫ్రీ ₹.320/-.


ఎంపిక విధానం:

మెరిట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.. మొత్తం 100 మార్కులుగా పరిగణించారు.

◆ అకడమిక్ విద్యార్హతలకు సాధించిన ప్రతిభకు 80 మార్కులు.

◆ ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహించిన దానికి 20 మార్కులు, ప్రతి 6నెలల సర్వీస్కు 2.5 మార్కులు లెక్కిస్తారు..

 

 

గౌరవ వేతనం:

పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ₹.58,850/- నుండి ₹.1,37,050/- వరకు జీతంగా చెల్లిస్తారు..

 అధికారిక వెబ్సైట్:   https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

 ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా.. ఆధార్ కార్డ్, 10 నుండి MBBS వరకు విద్యార్హత ధ్రువపత్రాలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నమోదు కాఫీ, లోకల్ అర్హత కోసం 1 నుండి 7 వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, సర్వీస్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ లను అప్లోడ్ చేయాలి.

 


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.07.2022 నుండి,

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.08.2022, సాయంత్రం 5 గంటల వరకు.

 

Tuesday, May 17, 2022

10పాస్ తో పోస్టల్ శాఖలో పర్మినెంట్ కొలువు | 38,926 ఖాళీల భర్తీకి ప్రకటన :Indian Post Recruitment 2022 |

 


 ఎలాంటి రాతపరీక్ష లేకుండా, పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారత పోస్టల్ సర్వీస్ తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 22 రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 38,926 పోస్టుల భక్తికి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి..

         విద్యార్హత ప్రమాణాలు, ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.

భారతీయ కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖకు చెందిన, ఇండియన్ పోస్టల్ సర్వీస్ దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న దాదాపుగా 39 వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 38,926.

ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీల సంఖ్య: 1,716.

తెలంగాణలో ఖాళీల సంఖ్య: 1,226.


విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి విద్యార్హతతో, స్థానిక భాషా పరిజ్ఞానం కలిగి మోటార్ సైకిల్ లేదా సైకిల్ నడపగలరు నైపుణ్యం కలిగి ఉండాలి.


వయసు: జూన్ 5, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అలాగే అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.


దరఖాస్తు ఫీజు: 

 జనరల్ అభ్యర్థులకు ₹.100/-

ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులకు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


ఎంపిక విధానం:
పదవ తరగతిలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా/ సిస్టం జనరేట్ చేసిన మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఏ ఇద్దరు అభ్యర్థుల మార్కులు సమానమైన.. వారి వయసును పరిగణలోకి తీసుకొని అధిక వ్యాసాలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికలు నిర్వహిస్తారు.


జీతం:

బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ₹.12,000/-

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్/ Dak Seva పోస్టులకు ఎంపికైన వారికి ₹.10,000/-


దరఖాస్తు విధానం:

దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ తో, ఆన్లైన్ దరఖాస్తు విధానం వీడియో లో అప్డేట్ చేస్తాను. తాజా నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.06.2022.

అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

అధికారిక వెబ్సైట్ : https://indiapostgdsonline.gov.in/

Friday, May 13, 2022

తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ హైదరాబాద్ సివిల్ జడ్జ్ పోస్టుల భర్తీకి ప్రకటన

 


తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ హైదరాబాద్ సివిల్ జడ్జ్ పోస్టుల భర్తీకి ప్రకటన.సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.

ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 50.

విభాగాల వారీగా ఖాళీలు:

◆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో  - 41 పోస్టులు

◆ ట్రాన్స్ఫర్ విధానములో - 9 పోస్టులు భర్తీ చేయనున్నారు.

విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగి కనీసం 3 సంవత్సరాలు అడ్వకేట్ గా ప్రాక్టీస్ కలిగిఉండాలి.

వయసు: జూలై 1, 2022 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల కు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తింపజేశారు, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు ఎంపిక రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.

ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ 100 మార్కులకు నిర్వహించి అందులో 40 శాతం మార్కులు సాధించిన వారిని షార్ట్లిస్ట్ చేసి, తదుపరి రాత పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

జీతం: ఎంపికైన వారికి బేసిక్ పే ₹.27,700 - 44,770/-ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు ₹.1,000/-

                       ఎస్సీ/ ఎస్టీ/ EWS లకు ₹.500/-.

దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:

అధికారిక వెబ్సైట్: https://tshc.gov.in/

అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.



Friday, April 9, 2021

HPCL Engineer Recruitment 2021..హెచ్‌పీ‌సీ‌ఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల...

 

 


 

 

హెచ్.పీ.సీ.ఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాలు...

ముంబైలోని ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మొత్తం 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీలు: 200 ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 

 

1. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్, మెకానికల్ మరియు ప్రొడక్షన్ సబ్జెక్ట్స్ లో నాలుగు సంవత్సరాల  రెగ్యులర్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

2. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాల రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ లో నాలుగు సంవత్సరాల రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

4. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ లో నాలుగు సంవత్సరాల రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: ఈ పై అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలకు మించకూడదు. మరియు రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.


ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

ఆన్లైన్ పరీక్ష విధానం: దీనిలో రెండు విభాగాలు ఉంటాయి.

1. జనరల్ ఆప్టిట్యూడ్: ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంటలెక్చువల్ అండ్ పొటెన్షియల్ టెస్ట్ ఉంటాయి.

2. టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్: ఇందులో అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టులకు సంబంధించిన సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు వస్తాయి.

➥ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అర్హత సాధించిన అభ్యర్ధులను పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ టాప్ కి పిలుస్తారు. అభ్యర్థులు అన్ని సంబంధిత పరీక్షల్లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

జీతాల వివరాలు: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 50,000/- నుండి 1,60,000/- రూపాయల వరకు ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు.


దరఖాస్తు ఫీజు:

➥ UR, OBCNC, మరియు EWS అభ్యర్థులకు రూ. 1180/-

➥ SC, ST, PwBD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. (వీరికి ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.)

Notification

దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

https://hindustanpetroleum.com/hpcareers/current_openings

 

 

 

 

 

Saturday, April 3, 2021

MES Recruitment 2021: మిలటరీ ఇంజినీరింగ్‌ సర్విస్ నుండి 502 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

 

 


 

ఇండియన్‌ మిలటరీ నుండి ఇంజినీరింగ్‌ సర్వీసెలో డ్రాఫ్‌ మెన్‌సూపర్‌వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 12లోగా దరఖాస్తు చేసుకొంది. నోటిఫికేషన్ పూర్తివివరాలిలా..


మొత్తం ఖాళీలు: 502 ఉన్నాయి.

విభాగాల వారీగా ఖలీలా వివరాలు:

డ్రాఫ్ట్స్‌మెన్‌ లో మొత్తం-52 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్స్‌షిప్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. మరియు సంబంధిత పనుల్లో ఏడాది అనుభవం ఉండాలి.

వయస్సు: ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.




సూపర్‌వైజర్‌(బారక్స్‌ అండ్ స్టోర్స్‌) విభాగం లో మొత్తం-450 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: ఎకనమిక్స్‌/కామర్స్‌/స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్పడీస్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. మరియు సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.

వయస్సుఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఓఎంఆర్‌ బేస్ట్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.




ఎగ్జామ్‌ ప్యాటర్న్‌ : 125 మార్కులకు రిటెన్‌ ఎగ్జామ్‌ ఉంటుంది.

ఇందులో నాలుగు విభాగాల ఉన్నాయి.

ప్రతి విభాగం నుండి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.

పరిక్షా సమయం: 120 నిముషాలు.


జనరల్ ఇంటెలిజెన్స్‌ అండ్ రేజనింగ్ నుండి 25 ప్రశ్నలు; 25 మార్కులు.

జనరల్ అవేర్ నెస్ అండ్ జనరల్ ఇంగ్లిష్ నుండి 25 ప్రశ్నలు; 25 మార్కులు.

న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు; 25 మార్కులు.

స్పెషలైజేషన్ టాపిక్స్ నుండి 25 ప్రశ్నలు; 50 మార్కులు.


ముఖ్యసమాచారం:

దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.


ధరఖాస్తు ఫీజు: రూ.100


ఎగ్జామ్‌ సెంటర్స్‌: సికింద్రాబాద్‌, విశాఖపట్నం

దరఖాస్తులకు చివరితేది: 12.04.2021


పరీక్ష తేది: 16.05.2021


అదికారిక వెబ్‌సైట్‌: https://mes.gov.in/

అదికారిక నోటిఫికేషన్: mesgovonline.com

దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: www.mesgovonline.com 

 

 

Friday, March 12, 2021

UPSC Civil Services Examination 2021 Notification Released | మొత్తం 712 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల.


 

సివిల్ సర్వీసెస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ - 2021 

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష

సివిల్ సర్వీసెస్ పరీక్ష నియమాలు 2021

ఉన్నత స్థాయి హోదా కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త!


మొత్తం 712 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ వెలువడింది, ఇందులో నుండి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు 110 పోస్టులు ఉంటాయి.


ఈ క్రింది 19 రకాల సేవల్లో ఖాళీలను భర్తీ చేయడానికి సివిల్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), సంబంధిత మంత్రిత్వ శాఖలతో మరియు కప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ శాఖల అంగీకారంతో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సిఎస్ఇ)-2021 రూల్స్ ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ చేత నిర్వహించబడుతుంది.


సివిల్ సర్వీసుల వివరాలు:

1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్

2. ఇండియన్ ఫారిన్ సర్వీస్

3. ఇండియన్ పోలీస్ సర్వీస్

4. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ గ్రూప్-ఎ

5. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ గ్రూప్-ఎ

6. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ గ్రూప్-ఎ

7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ గ్రూప్-ఎ

8. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ గ్రూప్-ఎ

9. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, జూనియర్ గ్రేడ్, గ్రూప్-ఏ

10. ఇండియన్ పోస్టల్ సర్వీస్ గ్రూప్-ఎ

11. ఇండియన్ పోస్టల్ అండ్ టెలీ కమ్యూనికేషన్ అకౌంట్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ గ్రూప్-ఎ

12. ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ గ్రూప్-ఎ

13. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్స్) గ్రూప్-ఎ

14. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్కమ్ టాక్స్) గ్రూప్-ఎ

15. ఇండియన్ ట్రేడ్ సర్వీస్ గ్రూప్-ఎ (గ్రేడ్-3)

16. ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్ గ్రూప్-బి (సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)

17. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్, లక్షద్వీప్, డామాన్ & డియూ అండ్ దాద్రా & నగర్హావేలి సివిల్ సర్వీస్(DANICS), గ్రూప్-బి

18. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్, లక్షద్వీప్, డామాన్ & డియూ అండ్ దాద్రా & నగర్హావేలి పోలీస్ సర్వీస్(DANIPS), గ్రూప్-బి

19. పాండిచ్చేరి సివిల్ సర్వీస్(PONDICS) గ్రూప్-బి

 ద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత మరియు ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


వయస్సు: ఆగస్టు 01, 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలకు తగ్గకుండా 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఆగస్టు 2, 1989 ఆగస్టు 01, 2000 మధ్య జన్మించి ఉండాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

రాత పరీక్షను రెండు విభాగాలుగా ఉంటుంది.

1. ప్రిలిమినరీ పరీక్ష 

2. మెయిన్ పరీక్ష


రిలిమినరీ పరీక్ష : ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 200 Marks ఉంటుంది. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రిలిమినరీ పరీక్షలో పేపర్-II జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్ గా ఉంటుంది, దీనిలో 33 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి ఎవరైతే ఈ ప్రిలిమ్స్ అర్హత సాధిస్తారో వారిని మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

మెయిన్స్ పరీక్ష: ఈ పరీక్షను మొత్తం 2025 Marks లకు నిర్వహిస్తారు. మెయిన్ పేపర్ మార్పుల యొక్క వివరణాత్మక విభజనను పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ను చదవండి. నోటిఫికేషన్ పిడిఎఫ్ ఫైల్ లింక్ ఈ పేజి చివరలో అందుబాటులో ఉన్నది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి.

 

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: ఈ పరీక్షను జూన్ 27,  2021 న నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ. 100/-

మహిళలు/ ఎస్సి/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు.


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 4, 2021 నుండి.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: మార్చి 24, 2021.


అధికారిక వెబ్ సైట్ లింక్: https://upsconline.nic.in/

అధికారిక నోటిఫికేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి